K-Ramp: రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని “K-ర్యాంప్” ప్రూవ్ చేసింది – దిల్ రాజు

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన “K-ర్యాంప్” మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. “K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో “K-ర్యాంప్” ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్ కేఎన్, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
నటి సీత మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో కిరణ్ గారికి మంచి సక్సెస్ దక్కింది. ఆయన మంచితనానికి తగిన విజయం లభించింది. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ దొరికింది. తనే మా హీరోయిన్ యుక్తి తరేజా. అన్నారు.
నటుడు అనన్య ఆకుల మాట్లాడుతూ – కిరణ్ అన్నకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో ఈ చిత్రంలో నటించేప్పుడు తెలిసింది. ఆయనలాగే కష్టపడితే తప్పకుండా సక్సెస్ అవుతామని అనిపించింది. నేనూ అలాగే సినిమా పట్ల ప్యాషన్ తో ఉండాలని నేర్చుకున్నాను. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని మేము చెప్పినందుకు ఈ రోజు ఫ్యామిలీస్ అంతా వచ్చి సినిమా చూస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.
రైటర్ రవీందర్ రాజా మాట్లాడుతూ – రివ్యూస్ కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మా “K-ర్యాంప్” సినిమాకు వస్తున్న వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న టైమ్ లో తన పూర్తి సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ నానికి థ్యాంక్స్. అన్నారు.
డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – “K-ర్యాంప్” చిత్రానికి మొదటిరోజు వచ్చిన రివ్యూస్ చూసి కొంత భయపడ్డాం. అయితే మా కిరణ్ గారు మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. మనం మంచి ఎంటర్ టైనర్ చేశాం ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెబుతూ వచ్చారు. ఆయన చెప్పినట్లే మా మూవీకి ఆడియెన్స్ ఆదరణ దక్కుతోంది. అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – డైరెక్టర్ జైన్స్ నాని “K-ర్యాంప్” కథ చెప్పినప్పుడే మిరపకాయ్, గబ్బర్ సింగ్ కు హరీశ్ శంకర్ కథ చెప్పిన ఫీల్ కలిగింది. ఈ సినిమాకు నాని ఎంతో కష్టపడ్డాడు. ఈ విజయానికి మొదటి కారణం ఆయనే. కిరణ్ గారికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుతుంటారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – కథ చాలా బాగుండటం వల్లే “K-ర్యాంప్”లో నా మ్యూజిక్ కు పేరొస్తోంది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. విజయం అనేది మా టీమ్ లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి సక్సెస్ ఇచ్చిన మీడియా, ఆడియెన్స్ కు కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ – 47 రోజుల్లో “K-ర్యాంప్” సినిమాను కంప్లీట్ చేశాం. టీమ్ ఎఫర్ట్ వల్లే అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాం. కిరణ్ అన్న ఎనర్జీ, ప్యాషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎస్ ఆర్ కల్యాణమండపం చూసి ఆయన ఫ్యాన్ అయ్యాను. ఇకపైనా కిరణ్ అన్న అభిమానిగానే ఉంటాను. కిరణ్ గారు చేసిన కుమార్ అనే క్యారెక్టర్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ బయట చెప్పుకుంటున్నారు. నేను 90’s కిడ్ ను. థియేటర్ బయట మౌత్ టాక్ చూసి సినిమాకు వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ వచ్చి భయపెడుతున్నాయి. రివ్యూస్ వారి వ్యక్తిగత విషయం నేను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ఏవీ పట్టించుకోము అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. సినిమాకు ఏం కావాలో ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివ గారు సపోర్ట్ చేశారు. అన్నారు.
నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ – నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్ కు రావడం హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఇష్టమైన దర్శకులు శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ట మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. సాయికుమార్, అలీ, నరేష్ గార్ల క్యారెక్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో కిరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రతి రోజూ సినిమాను ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేయడానికే ఆలోచిస్తుంటారు. కిరణ్ గారితో మళ్లీ మళ్లీ మూవీస్ చేయాలని ఉంది. మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఓవర్సీస్ లో కలెక్షన్స్ తగ్గాయి. గురువారం కిరణ్ గారితో యూఎస్ థియేటర్స్ టూర్ వెళ్తున్నాం. ఓపెనింగ్స్ కోసం యూత్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకే ప్రమోషనల్ కంటెంట్ డిజైన్ చేశాం, మాది ఫ్యామిలీ మూవీ అని చెబుతూ వచ్చాం. మేము చెప్పినట్లే ఈ రోజు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఇష్టపడుతున్నారు. మా సంస్థలో అందరూ కలిసి చూసే సినిమాలే నిర్మిస్తాం. మా పాప ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ చేసింది. ఈ కథలో హీరోయిన్ కు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఆ పాత్రను యుక్తి ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేసింది. మా డైరెక్టర్ జైన్స్ నాని కథ ఎంత ఫన్ గా చెప్పారో, స్క్రీన్ మీదకు అలాగే తీసుకొచ్చారు. డీవోపీ సతీష్ గారితో కలిసి నాని తక్కువ టైమ్ లో షూటింగ్ చేశారు. నైజాంలో మా మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసిన దిల్ రాజు, శిరీష్ గారికి థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – గతేడాది క సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాను. ఇప్పుడు “K-ర్యాంప్” విజయోత్సవానికి వచ్చాను. ఒక సినిమాకు యంగ్ టీమ్ పనిచేస్తే ఆ ఎనర్జీ డబుల్ అవుతుంది. ఈ సినిమాకు అనుభవజ్ఞలు, యంగ్ టీమ్ కలిసి పనిచేశారు. డైరెక్టర్ నాని చేసిన కథకు మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం, కిరణ్ లాంటి హీరో ఉండటం..అన్నీ కలిసి ఈ రోజు థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ నాని ఫాదర్ ఎమోషన్ ను కొత్తగా చూపించారు. ఒక రిచ్ కుర్రాడిని తీసుకెళ్లి మాస్ గా చూపించడం వర్కవుట్ అయ్యింది. నా సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయి రాజేశ్ దండ ప్రొడ్యూసర్ అయ్యారు. నేనూ అలాగే రామానాయుడు గారిని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా ఆర్య 2 మూవీకి పీఆర్ చేసిన ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్ అయి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నాడు. రైట్ కంటెంట్ ను తీసుకుని ఇన్వాల్వ్ అయి సినిమా నిర్మిస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని ఇస్తారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కామన్. అయితే కష్టడేవారికి ఏదో ఒక రోజు సక్సెస్ దక్కుతుంది. సక్సెస్ బాటలో వెళ్తున్న యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికీ నా అభినందనలు. ఈ దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో “K-ర్యాంప్” నెంబర్ గా నిలబడింది. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అలాగే కష్టపడండి. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ – “K-ర్యాంప్” తో సక్సెస్ అందుకున్న మా ప్రొడ్యూసర్స్ కు కంగ్రాట్స్. దిల్ రాజు గారు చెప్పినట్లు ఈ సినిమాలో సీనియర్స్ నటించాం. నరేష్, సాయి కుమర్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. కిరణ్ క తో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు “K-ర్యాంప్” తో హిట్ కొట్టారు. ఫస్ట్ సినిమాతో మా డైరెక్టర్ నాని విజయాన్ని అందుకున్నారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ – ప్రేమించిన వారి లోపాలను కూడా యాక్సెప్ట్ చేయాలనే మంచి పాయింట్ ను దర్శకుడు జైన్స్ నాని కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకునేలా రూపొందించాడు. ఒక మంచి కథ చెప్పాలని దర్శకులకు ఉంటుంది కానీ నిర్మాతకు కూడా అలాంటి ఆలోచన ఉండటం రాజేశ్ దండ గారిలో చూశాను. నాని ఆలోచనకు టీమ్ లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి మంచి సినిమా చేశారు. కిరణ్ ఈ చిత్రంలో బాగా పర్ ఫార్మ్ చేశారు. ఆయనలోని ఎనర్జీ చూస్తుంటే నాకు వెంకీ, దుబాయ్ శ్రీనులో రవితేజ గుర్తొచ్చాడు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ కూడా బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎస్ ఆర్ కల్యాణమండపంలో కిరణ్ చేసిన ఒక సీన్ నాకు చాలా ఇష్టం. హీరోయిన్ యుక్తి తన నటనతో ఇంప్రెస్ చేసింది. “K-ర్యాంప్” సక్సెస్ సందర్భంగా టీమ్ అందరికీ మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” పీపుల్స్ హిట్. కిరణ్ ఈ సినిమాకు తన పర్ ఫార్మెన్స్ తో ఆక్సీజన్ లా మారాడు. కిరణ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్తాడు. నాని కథ చెప్పినప్పుడే ఇది సూపర్ హిట్ అని అన్నాను. మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకున్న ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివ గారికి థ్యాంక్స్. యుక్తికి గుర్తింపు ఇచ్చే సినిమా ఇదని చెప్పాను. రివ్యూస్ ను గౌరవిస్తాం. కానీ ప్రేక్షకులు నిజమైన ఫలితాన్ని ఈ చిత్రానికి ఇచ్చారు. టీమ్ అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నా క్యారెక్టర్ కు రాసిన అమ్మే బ్రతికి ఉంటే అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇండస్ట్రీలో 50 ఏళ్ల అనుభవం ఉన్నా ఇప్పటికీ సినిమా రిలీజ్ రోజు టెన్షన్ పడుతుంటాం. “K-ర్యాంప్”కు కూడా అలాగే పడ్డాం. కానీ ప్రేక్షకులు మంచి విజయాన్ని ఇచ్చారు. క తర్వాత “K-ర్యాంప్”తో కిరణ్ కు మరో సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది. మా అబ్బాయి ఆది యూఎస్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ షోస్ బాగా పికప్ అయ్యాయి అని చెప్పాడు. “K-ర్యాంప్” కు ప్రేక్షకులు మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ టీమ్ అందరికీ మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – కిరణ్ గారు సక్సెస్ వస్తే పొంగిపోరు, ఫెయిల్యూర్ కు కుంగిపోరు. కష్టపడి పనిచేస్తూ వెళ్తారు. అందుకే ఆయనకు క సక్సెస్ తర్వాత “K-ర్యాంప్” విజయం దక్కింది. ఆయనతో మేము చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. సినిమా కోసం కష్టపడి పనిచేయడం కిరణ్ గారిని చూసి నేర్చుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ – ఈ రోజు మా సినిమా సక్సెస్ మీట్ కు ఎంతోమంది పెద్దలు రావడం హ్యాపీగా ఉంది. “K-ర్యాంప్”లో నేను చేసిన మెర్సీ క్యారెక్టర్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. తమ రెస్పాన్స్ మాతో షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి రోల్ రాసిన డైరెక్టర్ కు థ్యాంక్స్. కిరణ్ గారు మంచి కోస్టార్. ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉంది. నా చిన్నప్పటి రోల్ చేసిన మా రాజేశ్ గారి పాప సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేసింది. నా కో ఆర్టిస్టులు, టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ ఫ్లోస్ కట్టాడు ప్రొడ్యూసర్ రాజేశ్. డైరెక్టర్ నాని 47 రోజుల్లో సినిమా చేశారంటే ఎంత కష్టపడ్డారో ఊహించుకోవచ్చు. కిరణ్ తో నేను చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నా. ఆయన కథ విన్నప్పటి నుంచి ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్తారు. కిరణ్ గారికి సినిమానే ప్రపంచం. సక్సెస్ ఫెయిల్యూర్స్ కు చలించరు. క సక్సెస్ తర్వాత ఇప్పుడు “K-ర్యాంప్”తో విజయాన్ని అందుకున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఫుటేజ్ చూశాం. కిరణ్ గారి కెరీర్ లో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్, బెస్ట్ మూవీ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాను మరో వాళ్లైతే వదిలేసేవారేమో, కానీ పట్టుకుని అలా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లిన విధానం అద్భుతం. “K-ర్యాంప్” ప్రమోషన్ ఒక కేస్ స్టడీ, జీఎస్ కే శ్రీను, సురేష్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. బీ, సీ సెంటర్స్ లోకీ ఈ సినిమా బాగా రీచ్ అయ్యింది. ఈ టీమ్ అందరికీ మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ – కిరణ్ గారు క సినిమా తర్వాత మళ్లీ “K-ర్యాంప్” తో సక్సెస్ అందుకున్నారు. ఆయన కంగ్రాట్స్ చెబుతున్నా అలాగే ప్రొడ్యూసర్ రాజేశ్ గారు అనుకున్న ఔట్ పుట్ వచ్చేదాకా పనిచేస్తూనే ఉంటారు. సినిమా సక్సెస్ అయ్యాక ఆ రిలీఫ్ ఎలా ఉంటుందో ఊహించగలను. నాని మంచి హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో రాజేశ్ వాళ్ల పాప బాగా పర్ ఫార్మ్ చేసింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ గారికి ఒకే డైలాగ్ ఇచ్చి మెప్పించిన డైరెక్టర్ నాని సాహసాన్ని మెచ్చుకోవాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమా ఒక నవ్వుల పండగ. రిలీజైన నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణలో అన్ని సెంటర్స్ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది సూపర్ హిట్ సినిమా. పండగ భోజనంలా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళికి కిరణ్ సినిమా హిట్ అనేది సెంటిమెంట్ గా మారుతోంది. 47 రోజుల్లో సినిమా చేయడమే ఈ టీమ్ అందుకున్న మొదటి విజయం. అందుకు డైరెక్టర్ నాని, ప్రొడ్యూసర్ రాజేశ్ గారి ప్లానింగ్ ను అభినందించారు. సినిమాను ప్రేమించే హీరో కిరణ్. ఆయనతో చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. ఆ సినిమా టైమ్ లోనే “K-ర్యాంప్” గురించి చెప్పేవాడు. తన కంఫర్ట్స్, రెమ్యునరేషన్ కంటే సినిమా బాగుండాలని కోరుకునే హీరో కిరణ్. ఇలాంటి హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం. ఏడు ఛాట్ బస్టర్ పాటలతో చెన్నై లవ్ స్టోరీ సినిమాను చేస్తున్నాం. అది కిరణ్ కెరీర్ లోనే ర్యాంపేజ్ మూవీ అవుతుంది. సినిమా అంటే విశ్లేషణలు కాదు సెలబ్రేషన్. అలాంటి సెలబ్రేషన్ ను ప్రేక్షకులు చేసుకోవడం థియేటర్ లో చూశాను. “K-ర్యాంప్” ను జీఎస్ కే శ్రీను, సురేష్ తమ పీఆర్ తో నిలబెట్టారు. హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీడియా..మనమంతా సినిమా అనే ఒకే వేదిక మీద ఉన్నాం. సినిమా బాగుంటేనే మనమంతా బాగుంటాం. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తాం..”K-ర్యాంప్” సినిమాకు కూడా అలాగే వర్క్ చేశాం. కానీ ఏదో మ్యాజిక్ మమ్మల్ని డ్రైవ్ చేస్తూ వచ్చింది. ప్రతి టీమ్ మెంబర్ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డీవోపీ సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్..ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఈ సినిమాను ఇంకా ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు ఏం చేద్దామని అడుగుతుంటారు. రాత్రి 9 తర్వాత షూటింగ్ కు ఇంట్రెస్ట్ చూపని నరేష్ గారు మా మూవీకోసం తెల్లవారుఝామున 3వరకు షూటింగ్ చేశారు. మా సినిమా గురించి ఎంతో బాగా చెప్పి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశారు. మా పీఆర్ టీమ్ శ్రీను, సురేష్ ఎంతో కష్టపడ్డారు. రాజేశ్ గారి పాప తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ యుక్తి చాలా సపోర్టివ్ గా ఉంటూ షూటింగ్ చేసింది.
క తర్వాత అలాంటి కంటెంట్ ఉన్న థ్రిల్లర్స్ చేయాలనుకున్నాను. డైరెక్టర్ నాని ఈ సినిమా కోసం పదే పదే వెంటపడ్డాడు. ఎంటర్ టైన్ మెంట్ నీ బలం అన్నా మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ చేయి అన్నా అన్నాడు. ఇది పండగ సినిమా అని చెబుతూ వస్తున్నాం. ఏదో గొప్ప కథ చెప్పడం లేదు మిమ్మల్ని నవ్విస్తామని క్లియర్ గా చెప్పాను. డే 1 డిజప్పాయింట్ అయ్యాము. నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తా. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాకు కూడా ఇలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే నేను బలంగా నమ్మాను. “K-ర్యాంప్”ను కూడా బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నా కెరీర్ లో జరిగిన బిగ్ థింగ్ “K-ర్యాంప్”. ప్రతి షో హౌస్ ఫుల్ అవుతూ వస్తోంది. మా సినిమాను నిలబెట్టిన ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కెరీర్ లో ఇంతకంటే పెద్ద సక్సెస్ లు రావొచ్చు కానీ మా నమ్మకాన్ని నిలబెట్టిన విజయమిది. ఇక్కడా మనమంతా సమానమే, ఎవరూ చిన్నా కాదు ఎవరూ పెద్దా కాదు. మీడియా మిత్రులు కాస్త సపోర్ట్ చేస్తే, మాలాంటి వాళ్లం ఇంకా బలంగా నిలబడతాం. కిరణ్ అబ్బవరం సినిమా అంటే నమ్మకంగా థియేటర్స్ కు వెళ్లొచ్చు అనేలా సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. అన్నారు.