K-Ramp: “కె ర్యాంప్” తో ఫ్యామిలీతో కలిసి మా మూవీని ఎంజాయ్ చేస్తారని గ్యారెెంటీ ఇస్తున్నాం- కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్” (K-Ramp). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూనిట్ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ – కిరణ్ అబ్బవరంను కొత్తగా చూపించాలనే ప్రయత్నంతో టీమ్ లోని ప్రతి ఒక్కరం వర్క్ చేశాం. అన్నీ అనుకున్నట్లుగా, చాలా ఫాస్ట్ గా “K-ర్యాంప్” మూవీ కంప్లీట్ చేశాం. ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో కిరణ్ గారిని చూడబోతున్నాం. ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఈ మూవీ ఉంటుంది. మా ప్రొడ్యూసర్స్, ఇతర టీమ్ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే “K-ర్యాంప్” సినిమా ఇంత బాగా వచ్చింది. అన్నారు.
నటుడు అనన్య ఆకుల మాట్లాడుతూ – “K-ర్యాంప్” సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. థియేటర్స్ లోనే ఈ దీపావళి జరుపుకుందాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ కాదు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
డైలాగ్ రైటర్ రవీందర్ రాజా మాట్లాడుతూ – మా మూవీలో టాప్ ఇన్ ది కాలేజ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఈ దీపావళి బాక్సాఫీస్ కు టాపర్ మా సినిమా కావాలని కోరుకుంటున్నా. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ నాని గారు తను అనుకున్న స్టోరీ కన్విక్షన్ తో రూపొందించారు. కిరణ్ గారికి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – దీపావళికి పటాసులు ఎంత ముఖ్యమో, ఇలాంటి సినిమాకు పటాసుల్లాంటి ఆర్టిస్టులు ముఖ్యం. అలాంటి ఆర్టిస్టులంతా ఈ చిత్రానికి కుదిరారు. “K-ర్యాంప్” సినిమా మిమ్మల్ని గట్టిగా నవ్విస్తుంది. కిరణ్ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు. అన్నారు.
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – “K-ర్యాంప్” మూవీ మేమంతా చూశాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమా సక్సెస్ అయ్యాక మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారు మీసాలు మెలితిప్పాలి. డైరెక్టర్ జైన్స్ నాని సినిమా చేస్తున్న క్రమంలో బ్రదర్ లా మారిపోయాడు. ఇప్పుడు ఇతని గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ తర్వాత మీరంతా మాట్లాడుకుంటారు. ఈ చిత్రంలో చిన్న క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ రోల్స్ చేసిన కామ్నా జెఠ్మలానీ, విమలా రామన్, అజయ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరోయిన్ పెదనాన్న క్యారెక్టర్ లో నటించాను. నటుడిగా నాకు ఈ సినిమాతో మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో నటించేప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఈ దీపావళికి మీరంతా థియేటర్స్ లో చూసి ఆనందించి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు మంచి ఫ్రెండ్. చాలా ఫాస్ట్ గా మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు. కె ర్యాంప్ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు సామజవరగమన మూవీ లాంటి వైబ్స్ కనిపించాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. నాని, రవితేజలా అనిపించాడు. కె ర్యాంప్ తో కిరణ్ కూడా వారి లీగ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ వీఐ ఆనంద్ మాట్లాడుతూ – సినిమాలను ఎంజాయ్ చేయాలంటే దీపావళికే చేయాలి. నేను రెండు షోస్ చూసేవాడిని. దీపావళి పండుగ కళ కె ర్యాంప్ లో కనిపిస్తోంది. కిరణ్ గారు ఎంతో ఎనర్జిటిక్ గా ఈ మూవీలో కనిపిస్తున్నారు. ఆయనకు కె ర్యాంప్ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు స్నేహితుడు. వరుసగా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఆయన సక్సెస్ చూస్తుంటే సంతోషంగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ – కె ర్యాంప్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ దీపావళి ఫైర్ క్రాకర్స్ అంటించినట్లే ఉన్నాయి. దీపావళి పండక్కి ఇది పర్పెక్ట్ సినిమా. కిరణ్ గారిలో ఇంత ఎనర్జీ చూసి చాలా రోజులైంది. మీరు ఇలాంటి మంచి ఎంటర్ టైనర్స్ చేయాలని కోరుకుంటున్నా. నరేష్ గారికి ఈ సినిమా 3.ఓ అవుతుంది. అన్నారు.
డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ – కె ర్యాంప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్ మీట్ లా ఉంది. కిరణ్ గారికి, ప్రొడ్యూసర్ రాజేశ్, శివ గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – మరో సినిమా షూటింగ్ వల్ల కె ర్యాంప్ ఈవెంట్ కు రాలేకపోయాను. ఈ చిత్రంలో కిరణ్ కు ఫాదర్ రోల్ చేశాను. ఎస్ఆర్ కల్యాణమండపం తర్వాత మళ్లీ మేము తండ్రీ కొడుకుగా నటించాం. ఇది ధమాకా ఎంటర్ టైనర్. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఈ దీపావళికి థియేటర్స్ లో కె ర్యాంప్ చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరోయిన్ విమలా రామన్ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో చిన్న సర్ ప్రైజ్ క్యారెక్టర్ లో నటించాను. చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ చేశాం. ట్రైలర్ చూస్తుంటే కిరణ్ గారి ఎనర్జీ, టాలెంట్ సూపర్బ్ గా అనిపిస్తోంది. ఆయన ఇలాంటి మరెన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. కె ర్యాంప్ చాలా ఫన్నీగా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. యుక్తి బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. తన రోల్ లో పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ప్రొడక్షన్ మరిన్ని హిట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. దీపావళికి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ కోసం కె ర్యాంప్ చూడండి. అన్నారు.
హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ – ఈ సినిమాతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. నేను చాలా గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా ఇది. మీ కోసం ఈ దీపావళికి పవర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ లోడ్ అవుతోంది. కిరణ్ గారు ఒక పవర్ హౌస్ పర్ ఫార్మర్. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. మా డైరెక్టర్ నాని సెట్స్ లో ఎంత కామ్ గా ఉంటారో, ఆయన తీసే సీన్స్ అంత ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. మా ప్రొడ్యూసర్ రాజేశ్ గురించే మా టీమ్ అంతా మాట్లాడుకుంటుంది. ఆయన అందరినీ అంత బాగా చూసుకున్నారు. నరేష్ గారి వయసు 18 ఏళ్లనుకుంటా. అంత జోష్ లో ఉన్నారు. కె ర్యాంప్ ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ కోసం రెడీగా ఉండండి. అన్నారు.
ఎన్ బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ రాజేశ్ నాకు మంచి మిత్రులు. ఆయనకు బాలకృష్ణ గారిని అభిమానించడం, సినిమాను ప్రేమించడం ఈ రెండే తెలుసు. కె ర్యాంప్ ప్రీ రిలీజ్ కాదు, సక్సెస్ మీట్ లా ఉంది. కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం. అంత ప్యాషనేట్ గా మూవీస్ చేస్తుంటాడు. కె ర్యాంప్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ – క మూవీ విజయం తర్వాత కె ర్యాంప్ స్టార్ట్ చేశాం. ఒక సక్సెస్ వచ్చాక ప్రయారిటీస్ మారిపోతాయి. కానీ క హిట్ తర్వాత కూడా కిరణ్ గారు మా సంస్థకే మూవీ చేశారు. అదీ ఆయన కమిట్ మెంట్. ఈ సినిమాను 47 రోజుల్లో కంప్లీట్ చేశాం. సెట్ లో ప్రతి రోజూ నవ్వుకున్నాం, ఎంజాయ్ చేశాం. ఒక పిక్నిక్ లా షూటింగ్ జరిగింది. సెట్ లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్ విషయంలో గురి తప్పదు. చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనితో నెక్ట్స్ మూవీస్ చేస్తున్నా. మా డీవోపీ సతీష్ కోపరేషన్ వల్లే ఫాస్ట్ గా షూటింగ్ చేశాం. నేను డబ్బులతో ఇండస్ట్రీకి రాలేదు. కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్…ఇలా చేసుకుంటూ ప్రొడ్యూసర్ ను అయ్యాను. వరుసగా మూవీస్ చేస్తున్నాను అంటే మా పేరెంట్స్ ఆశీర్వాదం. కామ్నా, విమలా రామన్, నరేష్ గారు, వెన్నెల కిషోర్..వీళ్లంతా తమ పర్ ఫార్మెన్స్ లతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తారు. హీరోయిన్ యుక్తిది ఇంపార్టెంట్ రోల్. ఓనమ్ సాంగ్ లో కిరణ్ గారితో కలిసి ఎనర్జిటిక్ గా డ్యాన్సులు చేసింది. నాని కొత్త దర్శకుడిలా అనిపించలేదు. 47 రోజుల్లో మూవీ చేశాడు. ఈ సినిమా తర్వాత అతను పెద్ద దర్శకుడు అవుతాడు. కిరణ్ గారు ఇది తన సొంత ప్రొడక్షన్ లా భావించి వర్క్ చేశారు. 48 గంటలు కంటిన్యూగా వర్క్ చేశారు. కె ర్యాంప్ లో ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. కిరణ్ గారి గత చిత్రాలన్ని ఒక ఎత్తు, కె ర్యాంప్ ఒక ఎత్తు. ఫన్, ఎమోషన్, డ్యాన్స్..ఇలా ప్రతీది ఇరగదీశారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే మీరు ఆదరిస్తారు. ఈ దీపావళికి రిలీజ్ కు వస్తున్న చిత్రాలన్నీ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – కె ర్యాంప్ కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు కీ టెక్నీషియన్. సినిమా రిజల్ట్ ను ప్రభావితం చేయగలడు. అలాంటి ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ను నన్ను నమ్మి ఇచ్చిన కిరణ్ గారికి, నిర్మాత రాజేశ్ గారికి, డైరెక్టర్ నాని గారికి థ్యాంక్స్. కంటెంట్ లోని బలమే మ్యూజిక్ డైరెక్టర్ ను ఇన్స్ పైర్ చేస్తుంది. కె ర్యాంప్ మ్యూజిక్ కు, ట్రైలర్ లోని బీజీఎంకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్ వల్లే మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. కిరణ్ గారు నమ్మితే ఎంతో సపోర్ట్ చేస్తారు. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
లిరిక్ రైటర్ సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో టిక్కల్ టిక్కల్, కేరళ కుట్టి అనే రెండు సాంగ్స్ రాశాను. ఇలాంటి ఎంటర్ టైనింగ్ మూవీని థియేటర్స్ లోనే చూడాలి. మీ గుండెల్లో దీపావళిని నింపే చిత్రమిది. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్. కంటెంట్ యూత్ ఫుల్ గా ఉన్నా, సర్ ప్రైజింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీలో ఉన్నాయి. కె ర్యాంప్ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ – ఫస్ట్ మూవీ చేసే అవకాశం కల్పించిన హాస్య మూవీస్ ను లైఫ్ లో మర్చిపోలేను. మమ్మల్ని రోజు ఫాలో చేసి చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేసేలా మోటివేట్ చేశారు ప్రొడ్యూసర్ రాజేశ్ గారు. మా డీవోపీ సతీష్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ చతన్ భరద్వాజ్..వీళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మా ఆర్టిస్టులు నరేష్ గారు, కామ్నా, విమలా, సాయి కుమార్ గారు తమ పర్ పార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. నరేష్ గారికి ఈ సినిమా తర్వాత లవర్ బాయ్ నరేష్ అనే పేరొస్తుంది. కిరణ్ గారిని కలవడం, కథ చెప్పడం, సినిమా కంప్లీట్ చేయడం అంతా కలగా ఉంది. ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే, ప్రతీది ఎలా జరుగుతుందో టైమ్ టు టైమ్ కనుక్కుంటారు. ఇది సినిమా మీద ఆయనకున్న బాధ్యత. కిరణ్ గారి లాంటి హీరో మరొకరు ఉండరేమో. ఏదైనా సమస్య వస్తే నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చారు కిరణ్ అన్న. నేను స్క్రిప్ట్ మాత్రమే రాశా, ఆ క్యారెక్టర్ ను అంతలా ఓన్ చేసుకుని పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అన్న. నేను ఇక్కడ మాట్లాడను. స్క్రీన్ మీద సినిమానే మాట్లాడుతుంది. స్క్రీన్ మీద కిరణ్ అన్నను చూస్తే స్క్రీన్స్ చిరిగిపోతాయి. సినిమా అదిరిపోయింది. ఈ దీపావళికి మూవీ పెద్ద హిట్ అవుతుంది. రివ్యూయర్స్, మీమర్స్ అంతా ఫస్ట్ డే మూవీకి రండి, మీరంతా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మంచి మెసేజ్ ఉంటుంది. మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీలో మంచి రోల్ చేశాను. రాజేశ్ దండ గారి బ్యానర్ హిట్ లిస్ట్ లో మరో సినిమాగా కె ర్యాంప్ మారబోతోంది. కిరణ్ గారికి గట్టిగా ఫాలోయింగ్ ఉంది. మీరు స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే మామూలుగా ఉండదు. వీళ్ల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ నెల 18న వస్తున్న కె ర్యాంప్ మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీ థియేటర్స్ లో ర్యాంప్ ఆడిస్తుంది. రెండు వందలతో కొనే టపాసులు రెండు నిమిషాలే పేలతాయి. కానీ రెండు వందలతో కొనే కె ర్యాంప్ టికెట్ తో రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు. మా ప్రొడ్యూసర్ రాజేశ్ దండ రామానాయుడు గారి అంత పేరు తెచ్చుకుంటాడు. అతనిలో సినిమా పట్ల అంత ప్యాషన్ ఉంది. ఇలాంటి ప్రొడ్యూసర్ తరానికొకరే వస్తారు. మా డైరెక్టర్ జైన్స్ నాని పాన్ ఇండియా స్థాయికి వెళ్తాడు. హీరో కిరణ్ ఎనర్జీని ఈ చిత్రంలో చూస్తారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత కిరణ్ అని చెప్పుకుంటారు. స్టార్ లో నటుడు ఉండటం అరుదు. అలాంటి నటుడు కిరణ్. అతను ఈ చిత్రంతో మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నాతో ఒక సర్ ప్రైజ్ రోల్ చేయించారు. ఏమాత్రం రివీల్ చేసినా ఆ క్యారెక్టర్ లో ఫన్ మిస్ అవుతుంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుతా. కె ర్యాంప్ గురించి ఆ మూవీ కంటెంటే చెబుతోంది. ఈ నెల 18 నుంచి మనమంతా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నారు.
హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీ చూశాక ప్రేక్షకులు నన్ను మరింతగా ఇష్టపడతారు. ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ సంతోషాన్నిచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా లేయర్స్ ఉంటాయి. ఇలాంటి మంచి రోల్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ నానికి థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారికి సినిమా అంటే చాలా ఇష్టం. కిరణ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. తెలుగులో నేను చేసిన మూడో చిత్రమిది. నాపై మీరంతా చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. ఈ నెల 18న కె ర్యాంప్ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – కె ర్యాంప్ మూవీకి మొదటి నుంచీ సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మేమంతా ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మంచి సినిమా చేసినప్పుడే మిమ్మల్ని థియేటర్స్ రమ్మని కాన్ఫిడెంట్ గా పిలుస్తాం. ఈ సినిమా అనుకున్నప్పుడే దీపావళి రిలీజ్ అని ఫిక్స్ అయ్యాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే సినిమా అవుతుందని నమ్మాం. మేము అనుకున్నదానికంటే మూవీ ఇంకా బాగా వచ్చింది. మాకు వీలైనంత ప్రమోషన్ చేశాం. సాధ్యమైనంతగా మూవీని మీకు రీచ్ చేసేందుకు ప్రయత్నించాం. కె ర్యాంప్ మీ ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే మూవీ. నన్ను మా టీమ్ అందరినీ నమ్మండి. సినిమా బాగా వచ్చింది. ఈ దీపావళి పండుగ కె ర్యాంప్ మూవీతో మరింత సరదాగా ఉంటుంది. నా ఫ్యాన్స్ అన్నా పిలిస్తే కరిగిపోతాను. అన్న మంచి సినిమా చేశాడని మీరు చెప్పుకునేలా ప్రతి సినిమాకు బెటర్ మెంట్ చేసుకుంటూ వస్తున్నా. మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను. ఈ నెల 18న థియేటర్స్ లో కె ర్యాంప్ ర్యాంపేజ్ చూస్తారు. నా మంచి కోరే వారు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుని బెటర్ మెంట్స్ చేసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. థియేటర్స్ లోకి వెళ్లేముందు ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ అని గుర్తుపెట్టుకోండి. మీ టికెట్ డబ్బులు వృథా కావు. టికెట్ బుక్ చేయాలా వద్దా అనుకునేవారు కాన్ఫిడెంట్ గా బుక్ చేసుకోండి. మిమ్మల్ని గ్యారెంటీగా నవ్విస్తాం. ఈ సినిమాకు తప్పకుండా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ లో నా టీమ్ అందరి గురించి మాట్లాడుతా. అన్నారు.