జ్యోతిక జాక్ పాట్ కొడుతుందా?
వరుస సినిమాలతో కోలీవుడ్లో పుల్ బిజీ అయిపోయింది స్టార్ హీరో సూర్య సతీమణి సీనియర్ హీరోయిన్ జ్యోతిక. అందులో భాగంగా జ్యోతిక ఇటీవల కళ్యాణ్ డైరెక్షన్లో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి జాక్పాట్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పడి పడి లేచె మనుసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక జ్యోతిక ప్రస్తుతం దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలైంది.













