Jyothika: స్టార్డమ్ ఇంటి బయట వరకే అంటున్న జ్యోతిక
హీరోయిన్ గా కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక(Jyothika), స్టార్ నటుడు సూర్య(Suirya)ను పెళ్లి చేసుకుని మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు జ్యోతిక బిజీ అయింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్(Dabba Cartel) ఈ నెల 28న నెట్ఫ్లిక్స్(Netfilx) లో రిలీజ్ కానుంది. దాని ప్రమోషన్స్ లో జ్యోతిక పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని వెల్లడించింది.
డబ్బా కార్టెల్ సిరీస్ చేయడానికి మెయిన్ రీజన్ స్టోరీనేనని, ఈ సిరీస్ లో కంటెంటే కింగ్ అని, వ్యవహరిస్తుందని, షబానా అజ్మీ(shabana Azmi) లాంటి గొప్ప వ్యక్తితో పని చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పింది జ్యోతిక. నటిగా ఎన్నో ప్రయోగాలు చేసిన తనకు అన్నింటిలో మోజి మూవీ అంటే ఇష్టమని తెలిపింది.
ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, పిల్లల విషయంలో సూర్య, తాను ఎంతగానో ఆలోచిస్తామని, సూర్య, తను పెద్ద స్టార్లు అయినప్పటికీ ఇంటిబయటే తమ స్టార్డమ్ ను వదిలేస్తామని తెలిపింది జ్యోతిక. ఇంట్లో తమ పిల్లలకు తల్లిదండ్రులం మాత్రమేనని, ప్రతి రోజూ ఉదయాన్నే వారి బాక్సుల్లో ఎలాంటి ఆహారం పెట్టి పంపాలని ఇద్దరం ఆలోచిస్తామని చెప్తున్న ఆమె, తమ జీవితంలో పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని వెల్లడించింది.













