ఎన్టీఆర్31లో జగతి మేడమ్
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఒక్కసారిగా అమ్మడు నుంచి ఫోటోలు వైరల్ అవడం, ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుండటంతో సీరియల్స్ మానేయడం జరిగాయి. పెళ్లై ఓ పిల్లాడు పుట్టాక విడాకులు తీసుకున్న జ్యోతి రాయ్ తర్వాత యంగ్ డైరెక్టర్ సుకుపూర్ రాజ్‌ను పెళ్లి చేసుకుంది.
అయితే సుకుపూర్ రాజ్, కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ కు బాగా క్లోజట. దీంతో జ్యోతిని ఎన్టీఆ్31 మూవీ కోసం రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ కొద్దీ నీల్ కూడా కాదనలేకపోయాడని సమాచారం. విలన్ కు భార్య పాత్రలో జ్యోతి ఆ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న జ్యోతి రాయ్ వెండితెరపై ఎలాంటి క్రేజ్ ను సాధిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. కాగా, తాను ఎన్టీఆర్ తో తీయబోయే కథ చాలా కొత్తగా ఉంటుందని, భిన్నమైన ఎమోషన్స్ తో సాగుతుందని నీల్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.













