Jyothi Poorvaj: సింపుల్ లుక్స్ తోనే ఫిదా చేస్తున్న జ్యోతి
గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైన బుల్లితెర నటి జ్యోతి పూర్వాజ్(Jyothi Poorvaj) ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది జ్యోతి. తాజాగా జ్యోతి ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు రెడ్ కలర్ టాప్ లో చాలా సింపుల్ గా కనిపిస్తూనే తన అందాలతో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. జ్యోతి నేచురల్ లుక్స్ చూసిన ఆమె ఫాలోవర్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని షేర్ చేస్తున్నారు.













