జ్వాలాముఖి ఆడియో ఆవిష్కరణ
వైఎఫ్ క్రియేటివ్స్ పతాకంపై నిర్మించిన జ్వాలాముఖి చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎఫ్‌సిసి చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్, వైఎస్ చైర్మన్ గురురాజ్, టి మా కార్యదర్శి స్నిగ్ధ, మ్యూజికల్ డైరెక్టర్ రాజ్‌కిరణ్, గురుచరణ్, హరిశంకర్ మట్టగుంట, యూసుఫ్, కిరిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ విభిన్నమైన కథాంశాంతో తెర కెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు. గురురాజ్ మాట్లాడుతూ చిన్న సినిమాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మేం తప్పకుండా సాయం చేస్తామని తెలిపారు.













