‘జ్వాల’ చిత్రం ప్రారంభం
అమ్మా క్రియేషన్స్, శరవంత్ రామ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జ్వాల. విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ కలిసి నటిస్తున్నారు. అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలిని పాండే కథానాయిక. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం ప్రారంభమైంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ తెలుగులో నటిస్తున్న చిత్రమిదని, యాక్షన్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్‌తో నటించడం ఆనందంగా ఉందన్నారు. అరణ్ విజయ్ మాట్లాడుతూ సాహో తర్వాత చేస్తున్న చిత్రమిది. విజయ్ ఆంటోని చిత్రాలు తెలుగులో ఆదరణ పొందాయి. అదేవిధంగా ఈ చిత్రం కూడా రెండు భాషల్లో మంచి పేరు తెస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. నిర్మాత: టి.శివ, దర్శకత్వం: నవీన్ ఎం.













