Jr. NTR: యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్

గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) సందర్శించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) తో ఆయన భేటీ అయ్యారు. అమెరికా (America) లో చిత్రీకరించిన తన ఇటీవలి, రాబోయే ప్రాజెక్టుల గురించి ఆమెతో ఎన్టీఆర్ చర్చించారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కాన్సులేట్‌ను సందర్శించడం ఆనందంగా ఉందని లారా విలియమ్స్ పేర్కొన్నారు. భారత్ (India) , అమెరికా మధ్య సంబంధాలను మరింత బలపరిచే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.