Junior: జూనియర్ ఓటీటీ అప్డేట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి(gali janardhan reddy) కొడుకు కిరీటి(kireeti) హీరోగా, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల(sree leela) హీరోయిన్ గా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా జూనియర్(junior). రిలీజ్ కు ముందు మంచి హైప్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. జూనియర్ కు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది.
దీంతో జూనియర్ థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎదురుచూపులకు స్వస్తి చెప్తూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేశారు ఆహా(aha) నిర్వాహకులు. జూనియర్ సినిమా త్వరలోనే ఆహాలోకి వస్తుందని ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సినిమా సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని కొందరు అంటున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video) వద్ద కూడా ఉన్నాయని, ఇతర భాషల్లో ఈ సినిమా రైట్స్ ను ప్రైమ్ వీడియో దక్కించుకుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో జెనీలియా(genilia) ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.