Kanthara2: కాంతార2 జూనియర్ ఆర్టిస్టు మృతి
కాంతార2(kanthara2) సినిమాను ప్రమాదాలు వదలడం లేదు. మొన్నీమధ్య జూనియర్ ఆర్టిస్టులంతా బస్సులో వెళ్తుంటే కొల్లూరులో ఆ బస్సు బోల్తాపడి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ లో ఎవరూ ప్రాణాలు కోల్పోనప్పటికీ పలువురికి బాగా గాయాలయ్యాయి. ఆ తర్వాత సినిమా కోసమని వేసిన సెట్ గాలి వాన వల్ల కూలిపోయింది.
సెట్ కూలినప్పుడు కూడా ప్రాణ నష్టమేమీ జరగలేదు. కానీ ఇప్పుడు తాజాగా కాంతార2 షూటింగ్ లో మరో ప్రమాదం జరిగింది. సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్(Kapil) ప్రమాదావశాత్తూ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో జరిగింది. షూటింగ్ అయిపోయాక టీమ్ తో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో స్విమ్మింగ్ కు వెళ్లాడు కపిల్.
ఈత కొడుతున్న టైమ్ లో నది లోతు తెలియకపోవడం వల్లే కపిల్ మునిగి చనిపోయాడని తెలుస్తోంది. కపిల్ మరణంతో కాంతార2 యూనిట్ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొల్లూరు ప్రాంతంలో జరిగిన సంఘటన కావడంతో అక్కడి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కపిల్ కేరళకు చెందిన వ్యక్తి అని సమాచారం.






