లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న ఎప్పుడంటే..
బిగ్ బాస్ తర్వాత చాలా గ్యాప్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. త్వరలోనే జెమినీ టీవీ లో ప్రసారం కానున్నఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షో కు తారక్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇక్కడ కథ మీది కల మీది, ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం అంటూ ఒక ప్రోమోని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో మొదటి ప్రశ్నకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఒక గైడ్ చార్మినార్ ను చూపిస్తూ దేశం నాలుగు దిక్కుల నుండి టూరిస్టులు వస్తుంటారు. అందుకే దీన్ని చార్మినార్ అంటారు. రోడ్లు విశాలంగా ఉన్నాయని కట్టిశారని చెప్తుంటే, ఒక ఆటో డ్రైవర్ వచ్చి 400 ఏళ్ల కిందట ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది, దాని గుర్తుగా ఇది కట్టారు అని చెప్పుకొస్తాడు. ఇంత తెలిసి ఇక్కడేంటి అంటే బ్రతకాలంటే ఏదోకటి చేయాలి కదా సర్ అని అంటుంటే, ఎన్టీఆర్ మరి గెలుపుని వెతకాలి కదా సర్ అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటుంది. మార్చి 29న రాత్రి 8.15 కు మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడగబోతున్నట్లు తారక్ ఈ ప్రోమో లో చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ ప్రోమోలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినట్లు సమాచారం. ఈ షో కు సంబంధించిన నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారం అయితే, ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే 5వ సీజను ఎవరు మీలో కోటీశ్వరులు మాత్రం కొన్ని మార్పులతో జెమినీ లో ప్రసారం కానుంది.













