ఒక్క వాచ్ కోసం ఇన్ని కోట్లా???
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాచ్ లు అంటే చాలా ఇష్టం అని బోలెడు ఇంటర్వూస్ లో చెప్పాడు. తన దగ్గర రకరకాల వాచెస్ ఉన్నాయని చెప్పగా, ఇటీవల తన సోదరి సుహాసిని కుమారుడి పెళ్లి ఘనంగా చేయగా ఆ పెళ్లికి ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ లు హాజరయ్యారు. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోస్ ని చూసి నందమూరి అభిమానులు కూడా ఆనందంలో తేలుతున్నారు.
ఇక ఆ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకొన్న ‘పటెక్ ఫిలిప్’ కంపెనీ వాచ్ ఖరీదు అక్షరాలా 2 .45 కోట్లు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మరియు ఇతరులు ఆశ్చర్యానికి గురి అయ్యారట. ఒక్కో సినిమాకే కొన్ని కోట్లల్లో పారితోషికం తీసుకొనే ఈ హీరో ఇలాంటివి వాడటంలో అతిశయోక్తేమీ లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ తన తరువాత మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
‘దేవర’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ ఇతర అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడని ఇప్పటికే టాక్ వచ్చింది.













