రీ రిలీజ్కు రెడీ అయిన అదుర్స్
జూ.ఎన్టీఆర్ సినిమాల్లో ప్రతి ఒక్కరికీ నచ్చిన సినిమా అంటే అదుర్స్ మూవీనే. కమర్షియల్ సినిమాలో ఓ రేంజ్ కామెడీని జోడించి మంచి హిట్ అందుకున్నాడు వినాయక్. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.
ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ 23 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నవంబర్ 18న అదుర్స్ ను రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపించడం ఖాయం.
త్వరలోనే ఈ రీరిలీజ్ మూవీకి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. కొన్నాళ్ల క్రితం వరకు అదుర్స్2 వస్తుందనుకున్నారు కానీ రీసెంట్ గా వినాయక్ అది కుదిరే పని కాదని తేల్చి చెప్పేశాడు. మరోవైపు ఎన్టీఆర్ రేంజ్ కూడా మారిపోయింది కాబట్టి అలాంటి కామెడీ సినిమాలు చేయకపోవచ్చు. అదెలాగూ కుదరదు కాబట్టి అదుర్స్ సినిమానే మరోసారి రిలీజ్ చేసుకుని ఆ ముచ్చట తీర్చుకుంటున్నారు ఫ్యాన్స్.













