త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మంచు మనోజ్?
మీరనుకున్నట్టూ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మంచు మనోజ్ చేస్తున్నాడన్నది నిజమే అంటున్నారు టాలీవుడ్ జనం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తండ్రి మోహన్ బాబు కూడా పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలు వేసి తన నటనతో డైలాగ్ లతో ఓ ప్రత్యేకతను చాటుకునేవారు. అదే విధంగా కేవలం హీరోగానే కాకుండా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎక్కువగా తాపత్రేయపడుతున్నాడు మంచు మనోజ్. ఇక త్వరలో మంచువారి హీరో కూడా ఎన్టీఆర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తే ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారని రిస్క్ చేయడానికి హీరోలుకూడా సిద్ధమవుతున్నారు. ఇక మంచు మనోజ్ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీఆర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆభిమానులు స్పెషల్ పోస్టర్స్ ని కూడా డిజైన్ చేసేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న రెండవ సినిమా కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఎన్టీర్ సోదరుడు కళ్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ (చిన బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు “అయినను పోయి రావాలే హస్తినకు” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఒక టాక్ కూడా వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్ మిగతా నటీనటులకు సెలెక్ట్ చెసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఒక ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తిగా నెగిటివ్ రోల్ కాకుండా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్ర ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో మనోజ్ పాత్రను కూడా త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో మనోజ్, తారక్ మధ్య భయంకరమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్రివిక్రమ్ మాత్రం ఒక పవర్ ఫుల్ హీరోను ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. రెగ్యులర్ విలన్స్ ని తీసుకుంటే సినిమాలో ఎమోషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ విధంగా హీరోలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కాకపోతే మరి ఆ స్పెషల్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.













