ఎన్టీఆర్ మాటంటే మాటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకసారి మాటిచ్చాడంటే ఆ మాటకు ఎంతో విలువిస్తారు. ప్రాణం పోయినా సరే ఆ మాటను నెరవేర్చాల్సిందే అన్న రీతిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన వ్యక్తిత్వమే ఆయన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిందని అందరూ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్తుంటారు.
ఇక అసలు విషయానికొస్తే, ఎన్టీఆర్ తను పని చేయబోయే డైరెక్టర్ టాలెంట్ తప్ప మరేం చూడరని, అందుకే అజ్ఞాతవాసి లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత కూడా ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమా చేశాడు. గతంలో త్రివిక్రమ్ చేసిన సినిమాలు, ఆయన రైటింగ్, టాలెంట్ నచ్చి మాత్రమే ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేశాడు.
ఇప్పుడు ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ విషయంలో కూడా ఎన్టీఆర్ అదే చేశాడు. సినిమా కథ విషయంలో కొంచెం మార్పులు చేర్పులు చేయడానికి టైమ్ పట్టినా సరే చివరకు మాటిచ్చనట్లే కొరటాలతోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్, కొరటాలతో సినిమా చేస్తాడా అని చాలా మంది అనుకున్నారు. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి దేవరను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సక్సెస్ చూసి మాత్రమే ఛాన్స్ లు ఇస్తున్న ఇలాంటి రోజుల్లో ఎన్టీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం.













