ఎన్టీఆర్ సరసన రష్మిక ?
అరవింద సమేత తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నాయికగా ఎవరిని ఎంచుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్ర కోసం రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు లో తనే కథానాయిక. త్వరలో వస్తున్న భీష్మ లో నితిన్‌కు జోడీగా కనిపించబోతోంది. దీని తర్వాత అమె అంగీకరించిన సినిమాలేవీ లేవు. ఎన్టీఆర్ట్తో సినిమా చేసే అవకాశం వస్తే ఆమె వదులుకోక పోవచ్చు. మరి రష్మిక స్థానం ఖాయమేనా, కాదా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.













