కొరటాల సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఆమే!
ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గురించి రీసెంట్గా అప్డేట్ కూడా వచ్చింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం రిలాక్స్ అయ్యారు. షూటింగ్ మొదలయ్యే టైమ్ దగ్గర పడుతుండటంతో హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే జాన్వీ కపూర్‌ను సెలెక్ట్ చేశారని, గత కొంత కాలంగా డేట్స్, రెమ్యూనరేషన్ విషయంలో డిస్కషన్స్ జరిగాయని, ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ఫైనల్ గా ఎన్టీఆర్ పక్కన జోడీ కట్టేది జాన్వీనే అంటూ ఎన్టీఆర్30 మూవీ యూనిట్ అఫిషియల్‌గా అనౌన్స్ చేయాల్సింది మాత్రమే మిగిలి ఉంది.
చిరంజీవితో కొరటాల తీసిన ఆచార్య సినిమా ఘోర పరాజయం కావడంతో ఈ సినిమా లేటవుతూ వచ్చింది. స్క్రిప్ట్ విషయంలో ఆచి తూచి చాలా కేర్ తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్ కోసం ఓ బ్లాక్ బస్టర్ స్టోరీని రెడీ చేసినట్లు చిత్ర సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్30 ఆ సినిమాకు మించి ఉండేలా కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ విపరీతమైన క్రేజ్ అయితే సంపాదించుకుంది. మరి తెలుగు నాట జాన్వీ ఏ స్థాయి హీరోయిన్ అవుతుందో చూడాలి.













