ఆట నాది, కోటి మీది.. హోస్ట్ గా ఎన్టీఆర్… అదిరిపోయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో
జెమినీ టీవీ లో త్వరలోనే ప్రసారం కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని జెమినీ టీవీ యాజమాన్యం వెల్లడించింది. ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ట్వీట్ చేశారు. ఇక్కడ కల మీది కథ మీది.. ఆట నాది కోటి మీది అంటూ సాగే ప్రోమో లో ఎన్టీఆర్ తన లుక్ తో పాటూ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా.. ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోమో కే హైలైట్ గా నిలిచింది. అంతే కాదు లాస్ట్ లో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. సైనింగ్ ఆఫ్ మీ రామారావు అంటూ ప్రోమోని చాలా సింపుల్ గా ముగించేశారు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్, తారక్ గా తనను తాను చెప్పుకుంటూ వస్తున్న యంగ్ టైగర్ ఈ ప్రోమోలో మాత్రం రామారావు అంటూ ఫ్యాన్స్ కు, బుల్లితెర అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. గతంలో మా టీవీ లో ఈ షో ప్రసారమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగో సీజన్ రాబోతుంది. గతంలో నాగార్జున, చిరంజీవి లు హోస్ట్ లు గా చేయగా ఇప్పుడు ఆ అవకాశం తారక్ దగ్గరకి వచ్చింది. త్వరలోనే ఈ షో ప్రసారమయ్యే తేదీ, మిగతా వివరాలు వెల్లడి చేస్తామని సన్ నెట్వర్క్ తెలిపింది.













