ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ఖరారు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ కాంబినేషన్‌ని మరోసారి చూసే అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలిసి పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ నటించే 30వ చిత్రమిది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించే చిత్రమిదే. ఈ వేసవిలో పట్టాలెక్కుతుంది. ఎస్.రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అరవింద సమేత, ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ. ఈసారి పూర్తి వినోదాత్మక కథని ఎంచుకున్నట్టు సమాచారం. రష్మిక నాయికగా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.













