యన్ టి ఆర్ కు కరోనా పాజిటివ్… సెల్ఫ్ క్వారంటైన్‌లో చికిత్స

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వీడటం లేదు. సాధారణ, సెలబ్రిటీ అనే తేడాలేకుండా అందరినీ చుట్టేస్తూ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు కరోనా బారినపడగా.. తాజాగా యంగ్ టైగర్ యన్ టి ఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు బన్నీ. ఈ మేరకు అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో యన్ టి ఆర్ ఫాన్స్ ఆయన ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ”అందరికీ నమస్కారం.. నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను నా కుటుంభం సభ్యులం హోం ఐసోలేషన్లో ఉన్నాము. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కరోనా పట్ల కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోండి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సన్నిహితులు, ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని యన్ టి ఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం యన్ టి ఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శక ధీరుడు డైరెక్టర్రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాంచరణ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు రాజమౌళి. ఈ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వం లో యన్ టి ఆర్30 చిత్రం సిద్ధం అవుతుంది.