ఎన్టీఆర్30 కు పొలిటికల్ టచ్ ఇవ్వనున్నాడా..?
ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా రానుందనే విషయాన్ని ఇటీవలే అఫీషియల్ కూడా అనౌన్స్ చేసేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ్ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్, తారక్ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ అవడంతో ఇప్పుడు ఎన్టీఆర్30 మీద కూడా భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ఇంతకుముందు మహేష్ తో కొరటాల తీసిన భరత్ అనే నేను మాదిరిగానే తారక్ తో కూడా ఇప్పుడు కొరటాల అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజల కోసం, వారి సమస్యల కోసం పోరాడే ఒక సామాన్యుడు నాయకుడిగా ఎలా ఎదిగాడు? పాలిటిక్స్ లోకి వచ్చి ఎలా నిలదొక్కుకున్నాడనే పాయింట్ పై కథ నడవనుందని తెలుస్తుంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కుటుంబానికి సంబంధించిన ఎన్టీఆర్, ఇప్పటివరకు ఆ నేపథ్యంలో సినిమా చేసింది లేదు. ఇక పోతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ బాగా ఆశ పడుతున్న టైమ్ లో అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం మంచి సూచికే అని అందరూ భావిస్తున్నారు. మరి ఈ న్యూస్ నిజమా లేక కేవలం న్యూస్ మాత్రమేనా అన్నది తెలయాల్సి ఉంది.













