చరణ్ కూతురికి ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్
రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఇటీవలే ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అనే పేరును పెట్టారు. ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకుని పెట్టినట్లు చిరంజీవి కూడా వెల్లడించాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహ బంధం ఉందని ఆ చిత్ర ప్రమోషన్స్ లో చాలా సార్లు ఇద్దరూ చెప్పారు. క్లీంకార పుట్టినప్పుడు ఎన్టీఆర్,చరణ్ దంపతులకు ప్రత్యేకంగా విషెస్ కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ కూతురు కోసం ఎన్టీఆర్ ఒక స్పెషల్ బహుమతిని పంపినట్లు తెలుస్తోంది. దీన్ని ఎన్టీఆర్ స్పెషల్ గా డిజైన్ చేయించి మరీ ఇచ్చాడట.
చరణ్, ఉపాసన, క్లీంకార ఫోటోలు ప్రింట్ చేసి ఆ ఫోటోలను ఓ గోల్డ్ డాలర్ గా చేయించి దాన్ని క్లీంకారకు బహుమతిగా పంపాడట ఎన్టీఆర్. ఈ గిఫ్ట్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చిందిని, గొప్ప డిజైనర్‌తో ఈ డాలర్ ను ఎన్టీఆర్ డిజైన్ చేయించినట్లు సమాచారం. ఎన్టీఆర్, చరణ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్పడానికి ఇది చాలా చిన్న గిఫ్ట్ అని, వారిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు .













