ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు వాయిదా..?
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చాలా షూటింగ్ లు ఆగిపోతున్నాయి. రిలీజ్ లు కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ప్రాణాలే ఎక్కువని జనం థియేటర్స్ కు కూడా రాకుండా టీవీ ఛానెల్స్, ఓటీటీలకే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు మళ్లీ ఆ రెండు మాధ్యమాలు తమ పంథా చూపిస్తున్న టైమ్ లో సీరియల్స్, టీవీ షో లకు షూటింగ్ లకు కరోనా దెబ్బ వేస్తుంది. దీంతో ఇప్పటికే కొన్ని షూటింగ్ లు ఆగిపోయాయి. మరికొన్ని అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న షో పరిస్థితేంటనేది ఇప్పటికే చర్చగా మారింది.
బాలీవుడ్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ ఎవరు మీలో కోటీశ్వరులు షో జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తో ఎన్టీఆర్ మరోసారి టెలివిజన్ తెరకు మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సరిగే అదే సమయానికి కోవిడ్19 వేవ్ తో కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి దీంతో మే లో షూటింగ్ మొదలెట్టాల్సిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు జూన్ వరకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులున్నాయని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ప్రోమో కట్స్ తీశారు.ఎంట్రీ కశ్ఛన్స్ ను కూడా జెమినీ టీవీ లాక్ చేసేసింది. ఇక షో స్టార్ట్ అవడమే లేట్ అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడు ఆ షో వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు కరోనా భయంతో షో లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోవడమే అని తెలుస్తుంది. ఇప్పటికే షో కి సంబంధించి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇలాంటి సెలబ్రిటీస్ షో ను హోస్ట్ చేస్తున్నారంటే అప్లికేషన్లు లక్షల్లో వచ్చేవి కానీ ఇప్పుడు అవి వందల్లో కూడా లేకపోవడంతో పరిస్థితులు నార్మల్ గా అయ్యాక షో ను మొదలెడదామనే యోచనలో జెమినీ టీవీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ వార్తలకు సంబంధించిన అధికారిక సమాచారం ఎక్కడా బయటకు రాలేదు.













