#NTR30 మొదలయ్యేది ఎప్పుడంటే..
అరవింద సమేత బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయిననూ పోయి రావలె హస్తినకు.. అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకుని జక్కన్న నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ దే. ఈ సినిమాలో తారక్ పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడని, ప్రస్తుత రాజకీయాల్లో జనాలు ఎలా మోసపోతున్నారనే నేపథ్యంలో ఈ కథ నడవబోతుందని.. వాటితో పాటు ఆధ్యాత్మిక అంశాలను కూడా త్రివిక్రమ్ టచ్ చేస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండనుందట. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తుంటే, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడట. అంతే కాదు హీరో జయరామ్, రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారట. ఈ సినిమాను జూన్ లేదా జులై నుంచి మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది.













