NTR: తాతపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దేవర(Devara) సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్ లో వార్2(War2) సినిమా చేశాడు. హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో ఈ సినిమా చేసిన ఎన్టీఆర్ ఆ సినిమాతో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే వార్2 షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేశాడు.
దాంతో పాటూ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే తారక్(Tarak) ఎంత బిజీగా ఉన్నప్పటికీ మే 28న తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) జయంతి కావడంతో వీలు చేసుకుకని మరీ ఆయన సమాధి దగ్గరకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటాడనే సంగతి తెలిసిందే.
ఇవాళ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఉదయాన్నే తన అన్న కళ్యాణ్ రామ్(Kalyan Ram) తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి అక్కడ కాసేపు సమయాన్ని గడిపి వచ్చిన తారక్ ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా తన తాతయ్య గురించి ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్దమనసులో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా” అంటూ తారక్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.