అలాంటివి ఎన్టీఆర్ చేసే ఛాన్సే లేదు
ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, వార్2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో తారక్ ఎలాంటి పాత్ర చేయనున్నాడన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. హృతిక్ తో పాటూ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడా? లేక విలన్ క్యారెక్టరా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నెగిటివ్ రోల్ చేస్తే దాన్ని తారక్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారని కూడా సందేహం. హృతిక్‌తో ఈక్వల్ రోల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కానీ ఒకవేళ అలా జరగక పోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ విషయంలో జరిగిందే అదే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ వార్2 కంటే ముందే టైగర్3 సినిమాతో జరగనున్నట్లు రీసెంట్గా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ క్లైమాక్స్ లో కనిపించే గెస్ట్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఈ వార్తలు నిజమయ్యే ఛాన్సులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఇప్పటికే టైగర్3 షూటింగ్ పూర్తి అయిపోయింది. పైగా ఎన్టీఆర్ లాంటి హీరోతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయించినప్పుడు నిర్మాణ సంస్థ ఆ విషయాన్ని ప్రమోషన్స్ కోసమైనా కచ్ఛితంగా వాడుకుంటుంది కానీ ఇప్పటివరకు ఈ వార్త గురించి నిర్మాణ సంస్థ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ చేయట్లేదని అర్థమవుతుంది.













