టార్గెట్ కంటే కంటెంటే ముఖ్యమంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసిన దేవర ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సినిమా రిలీజై ఏడాది దాటింది. కానీ సినిమా పూర్తి కాలేదు.
దీంతో టార్గెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను చుట్టేస్తున్నారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దానికి కారణం కొరటాల గత సినిమా ఆచార్య డిజాస్టర్ అవడం. ఆచార్య చేసిన గాయాన్ని మర్చిపోయి శివ, దేవరతో మంచి హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు. సినిమా స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ బాగా వస్తుండటం వల్లే దేవరను రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయ్యారు.
అందులో భాగంగానే దేవర1 ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. స్టార్ హీరోల సినిమాలు చెప్పిన తేదీకి రావడం కష్టమే. అనుకున్న అవుట్ పుట్ రావాలంటే కొన్నిసార్లు రిలీజ్ డేట్ విషయంలో కాంప్రమైజ్ అవడం తప్పదు. అందుకే రిలీజ్ డేట్ టార్గెట్ గురించి ఆలోచించకుండా సినిమా బాగొస్తుందా లేదా అన్నది మాత్రమే దృష్టిలో పెట్టుకుని, రిలీజ్ అయినప్పుడు మంచి కంటెంట్ తో వస్తే చాలు లేటయినా ఫర్లేదంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.













