మంచి మిత్రుడు TNR ఇక లేరు

ప్రముఖ జర్నలిస్ట్ టిఎన్ఆర్ (తుమ్మల నరసింహ రెడ్డి) గారు కరోనా తో పోరాడుతూ ఇప్పుడే కనుమూశారు ! నిన్న ఉదయం నుంచి అయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది! రాత్రి కోమా స్థితికి వెళ్లారు! ఇప్పుడే టిఎన్ఆర్ ఇక లేరు అని వైద్యులు ప్రకటించారు.
టిఎన్ఆర్ అంటే జర్నలిజం లో ఒక బ్రాండ్! యూట్యూబ్ క్వాలిటీ జర్నలిజం లో ఆయనొక సంచలనం! ఎందరికో స్ఫూర్తినిచ్చిన జర్నలిస్ట్ ! అయన ఒక ఇంటర్వ్యూ చేస్తే బావుండు అని ఎందరో ఎదురు చూసేలా చేసారు ! మంచి మనసున్న జర్నలిస్ట్! అంతకు మించిన మానవతావాది! నవ్వు చెదరకుండా నొప్పించకుండా ఎదుటి వారికీ చెమటలు పట్టించడం లో మేటి జర్నలిస్ట్ ! ఎన్ని ఇంటర్వ్యూలు, ఎన్ని మనోగతాలు, ఎందరి ఇన్నర్వ్యూలు ! TNR కే సాధ్యం అనేలా కెరీర్ లో దూసుకెళ్లారు! ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు ఎదురీదారు ! అయినా నవ్వు చెదరలేదు ! ఇప్పుడూ నవ్వుతూనే వెళ్లిపోయారు ! కొందరంతే, మంచిగా మన గుండెల్లో తిష్ట వేసుకుంటారు ! ఇలా బాధను మిగిల్చి అకస్మాత్తుగా వెళ్లిపోతుంటారు! మిత్రమా నీకు కన్నీటి నివాళి! కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– డాక్టర్ మహ్మద్ రఫీ