లక్ ని పరీక్షించుకుంటోన్న రకుల్..!
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కెరీర్ ను స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల పక్కన కూడా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు రకుల్ కు సినిమాలు తగ్గాయి. తెలుగులో తను చేస్తున్నసినిమాలు ఒకటి రెండు మాత్రమే. మరోవైపు బాలీవుడ్ లో కూడా తన లక్ ను ప్రయత్నించుకునే భాగంలో జాన్ అబ్రహం తో కలిసి ఎటాక్ సినిమా చేసింది. ఆ సినిమాపై రకుల్ కు భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రస్తుతం ఎటాక్ షూటింగ్ కంటిన్యూగా జరుగుతుంది. ఆగస్టు లో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. లక్స్య రాజ్ ఆనంద్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ తో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఆగస్టు 13న రిలీజ్ కానున్నఎటాక్ పై రకుల్ చాలానే హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా అయినా రకుల్ కు వరుస బాలీవుడ్ ఆఫర్లను తెస్తుందేమో చూడాలి మరి.













