టాలీవుడ్ కి మిస్ యూఎస్ఏ
మరొక తెలుగమ్మాయి వెండితెరపై మెరవబోతోంది. అమెరికాలో అందాల పోటీల్లో మెరిసిన జో శర్మ (జ్యోత్స్న) కథానాయికగా త్వరలోనే ఓ చిత్రం చేయబోతున్నట్టు నిర్మాత మోహన్ వడ్లపట్ల తెలిపారు. తెలుగమ్మాయైన జో శర్మ అమెరికాలోని శాంటాక్లారా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మిస్ యూఎస్ఏ ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ టాలెంట్ కాంటెస్ట్-2019లో పాల్గొని విజేతగా నిలిచారు. మోడలింగ్, డ్యాన్సింగ్ యాక్టింగ్తో పాటు.. మహిళా సాధికారికత గురించి ప్రసంగించిన జో శర్మ విజేతగా నిలిచారనీ, ఫైనల్లో వివిధ దేశాల నుంచి 15 మంది పోటీ పడ్డారని మోహన్ వడ్లపట్ల తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న లవ్ 20-20 తర్వాత, జో శర్మ కథానాయికగా సినిమాని మొదలు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు.













