Jigries: తరుణ్ భాస్కర్ లాంచ్ చేసిన మౌంట్ మెరు పిక్చర్స్ ‘జిగ్రీస్’
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ “జిగ్రీస్” (Jigries). హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా మీరేలే సాంగ్ లాంచ్ చేశారు.
సయ్యద్ కమ్రాన్ ఈ సాంగ్ ని ఫ్రెండ్ షిప్ మెలోడీగా కంపోజ్ చేశారు. హరీష్ రెడ్డి ఉప్పుల రాసిన లిరిక్స్ ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్ ప్రజెంట్ చేశాయి. ఏక్నాథ్ వోకల్స్ సాంగ్ ని మరింత టచ్చింగ్ గా మార్చింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా అందరికీ కనెక్ట్ అవుతుంది.
జిగ్రీస్ ఫ్రెండ్షిప్, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈశ్వరాదిత్య డీవోపీ, కమ్రాన్ మ్యూజిక్, చాణక్య రెడ్డి ఎడిటర్.
జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.







