విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో జాన్వీ
శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, స్టార్ కిడ్‌గా తన జర్నీని స్టార్ట్ చేసినా తర్వాత తన అందం, అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. మొన్నటివరకు బాలీవుడ్లోనే సినిమాలు చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ కి ఈ సినిమా రిలీజ్ కాకముందే తెలుగు లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు జాన్వీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. త్వరలోనే జాన్వీ కపూర్ తమిళంలో అరంగేట్రం చేస్తోందట. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ కు జోడీ గా జాన్వీ నటించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాలో నటించమని స్వయంగా విఘ్నేష్ వెళ్లి అడగంతో జాన్వీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. గతంలోనూ జాన్వీ తమిళంలో నటించనుందని వార్తలొచ్చాయి కానీ అవన్నీ పుకార్లని బోనీ కపూర్ ఖండించారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముంది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.













