లక్ష్యసాధన కోసం ఓ యువకుడి సాగించిన ప్రయాణమే ఈ చిత్రం
విజయ్రాజా, రాశీసింగ్, నక్షత్ర నాయకానాయికలుగా నటించిన చిత్రం జెమ్. పత్తికొండ కుమారస్వామి నిర్మాత. సుశీలసుబ్రహ్మణ్యం దర్శకుడు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. లక్ష్యసాధన కోసం ఓ యువకుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. విజయ్రాజా పాత్ర కొత్తగా ఉంటుంది అని తెలిపారు. కథను హీరోగా నమ్మి చేసిన సినిమా ఇది. అజయ్, సంపూర్ణేష్బాబుతో పాటు ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది అని విజయ్రాజా తెలిపారు. ప్రేమ, యాక్షన్, వినోదంతో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉన్న సినిమా ఇదని రాశీసింగ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో సునీల్ కశ్యప్ పాల్గొన్నారు.













