Samantha: నా లైఫ్ లో అసూయకు చోటే లేదు: సమంత
సమంత(Samantha), నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరికీ పొంతన కుదరకపోవడంతో వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత సమంతకు మయోసైటిస్(Myositis) అనే వ్యాధి రావడం, దాని చికిత్స కోసం సమంత కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉండటం జరిగాయి.
ఇప్పుడు మళ్లీ సమంత నార్మల్ అయిపోయింది. నాగచైతన్య శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala)ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. అయితే తాజాగా సమంత తన మాజీ కొత్త బంధంలోకి వెళ్లడంపై మాట్లాడింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ నుంచి బయటికొచ్చి జీవితంలో ముందుకెళ్లడం గురించి సమంతకు ప్రశ్న ఎదురైంది.
దానికి సమంత సమాధానమిస్తూ, ఆ బాధ నుంచి బయటకు రావడానికి తాను చాలా శ్రమ పడినట్టు చెప్పుకొచ్చింది. మాజీ భర్త కొత్త రిలేషన్లోకి వెళ్లినందుకు మీరేమైనా అసూయ పడుతున్నారా అని అడగ్గా, తన లైఫ్ లో అసూయకు చోటు లేదని, ఎప్పటికీ అసూయ అనేది ఉండదని, ఏ చెడుకైనా మూలం అసూయేనని, అయినా అలాంటి వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.













