కరోనా క్రైసిస్ చారిటీకి జయదేవ్ గల్లా, పద్మావతి గల్లా దంపతులు రూ. 10 లక్షల విరాళం
పేద సినీ కళాకారులు, కార్మికులను ఆదుకోవడంలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ భాగస్వాములయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులకు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అమర రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ Pvt Ltd, రూ. ౧౦ లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉందనీ, దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్డౌన్ను అందరూ గౌరవించాలనీ, వైద్యులు, పోలీసుల సూచనలను పాటిస్తూ, అందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ అందరు ఇంటివద్దనే ఉండి కరోనా వైరస్ని కట్టడి చేయాలనీ ప్రజలను కోరారు.













