వైఎస్ఆర్ సతీమణిగా జయసుధ?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో రూపొందుతున్న యాత్ర సినిమా రోజురోజుకూ ప్రత్యేకతలు సంతరించుకుంటోంది. వైఎస్ఆర్గా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రను జగపతిబాబు పోషిస్తున్నారు. వైఎస్‌కి అత్యంత సన్నిహితుడైన కె.వి.పి.రామచంద్రరావు పాత్ర కోసం రావు రమేష్‌ని ఎంపిక చేయగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ సతీమణి శ్రీమతి విజయమ్మ పాత్ర కోసం సహజ నటి జయసుధను ఎంపిక చేశారని తెలుస్తోంది. భర్తను కోల్పోయినప్పటి నుంచి జయసుధ సినీ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటుండడం తెలిసిందే.













