సీనియర్ నటి జయచిత్రకు భర్త వియోగమ్
అలనాటి హీరోయిన్ జయచిత్రకు భర్త వియోగం చోటుచేసుకుంది. ఆమె భర్త గణేష్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈ రోజు శనివారం నిర్వహించనున్నారు.సీనియర్ నటి, దర్శకురాలు జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం కన్నుమూశారు. తిరుచ్చిలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్ గార్డెన్లో గల స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు కుటుంబానికి చెందిన జయచిత్ర తెలుగు, తమిళ్, మలయాళం, మరియు కన్నడ భాషలలో సుమారు 200కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 80 వ దశకంలోనే అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే కుంభకోణం ప్రాంతానికి చెందిన గణేశ్‌తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఆమ్రేష్ వీరి కుమారుడే.













