Jayakrishna Gattamaneni: అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని(Jayakrishna Gattamaneni) హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు.(Presented by Ashwini Dutt of Vyjayanthi Movies) చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్ బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు మూడవ తరం స్టార్ జయ కృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
జయకృష్ణ ప్రస్తుతం నటన, ఫైట్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. “పక్కా తెలుగు హీరో”గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథగా నిలవనుంది.
అనౌన్స్మెంట్ పోస్టర్లో తిరుమల ఆలయం, పరిసర పర్వతాల కారికేచర్ ఉండటం ఎక్సయిటింగ్ గా వుంది.
ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్‌తో పాటు మిగతా వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.







