‘జాతిరత్నాలు’ హిందీ లో రీమేక్ అక్కడ కూడా నవీన్ పొలిశెట్టి హీరో?
టాలీవుడ్ చిత్రాలు ఎప్పుడు హిట్ అవుతాయా? అని లటుక్కున రీమేక్ రైట్స్ కొని వెంటనే ఎనౌన్స్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు అయితే ఈ మధ్యకాలంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిన్న బడ్జెట్ సినిమా ‘జాతిరత్నాలు’. ఇప్పుడు హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కే.వీ. అనుదీప్ డైరక్షన్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు’ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓ పక్క ఓటిటి లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు అవుతున్నాయి. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకులతో నవ్వులు పూయించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.
ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయట. అయితే హిందీలో ఈ సినిమా హీరోగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే చర్చ మొదలైంది. ఇప్పటికే ‘చిచోరే’ సినిమాతో హిందీ ఆడియన్స్‌ని మెప్పించాడు నవీన్. మరోవైపు అంతకు ముందు అతను యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందాడు. దీంతో ‘జాతిరత్నాలు’ హిందీ రీమేక్‌లోనూ హీరోగా అతన్నే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ రాహుల్, ప్రియదర్శిల పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. ఇక ‘జాతిరత్నాలు’ హిందీ వెర్షన్‌కి కూడా కేవీ అనుదీపే దర్శకత్వం చేయనున్నాడట. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌ని (హైదరాబాద్ టూ అమెరికా) కూడా అనుదీప్ ప్లాన్ చేస్తున్నాడని. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ని కూడా అతను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.













