సెంటిమెంట్ గా మారుతున్న జాతర ఎపిసోడ్లు
ఇండియాలో పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదొక సందర్భంలో జాతర చూడకుండా ఉండరు. పెద్ద నగరంలో ఉన్నా చిన్న టౌన్ లో ఉంటున్నా ఈ సాంప్రదాయాన్ని మిస్ అవరు. జాతరకు అంతటి ప్రాముఖ్యత ఉంది. రీసెంట్ గా ఈ జాతర ఓ సక్సెస్ ఫార్ములాగా మారుతుందని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రీసెంట్ గా రిలీజైన దేవర(Devara)లో డైరెక్టర్ కొరటాల శివ(Director Koratala Siva) రెండు కీలక ఎపిసోడ్స్ ను ఈ జాతర చుట్టూనే డిజైన్ చేశాడు.
ఎన్టీఆర్(NTR) అదిరిపోయే స్టెప్పులేసింది కూడా ఈ జాతర సాంగ్ లోనే. ఇంటర్వెల్ కు ముందొచ్చే కీలక సీన్ లో లీడ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గతేడాది వచ్చిన మంగళవారం(Mangalavaram Movie) లాంటి థ్రిల్లర్ సినిమా కూడా జాతర బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు(Committee Kurrollu) సినిమాలో కూడా మెయిన్ ట్విస్టు జాతర మీదే ఉంటుంది.
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie) సినిమాలో కూడా జాతర ఎపిసోడ్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే పుష్ప2(Pushpa2)లో గంగమ్మ జాతర(Gangamma Jathara) గురించి టీమ్ చెప్తున్న విషయాలు ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పుష్ప2లో ఈ జాతర ఎపిసోడ్ ఏకంగా పావు గంటకు పైగా ఉంటుందట. జాతర ఎపిసోడ్స్ ఉన్న ప్రతి సినిమా మంచి విజయం అందుకుంటున్న నేపథ్యంలో పుష్ప2 కూడా సెన్సేషనల్ హిట్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













