Janhvi Kapoor: చీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ
శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor) ఎలాంటి అవుట్‌ఫిట్ లో అయినా వావ్ అనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ కు సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చే జాన్వీ తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మరింత అందంగా కనిపించింది. గోల్డ్ కలర్ శారీ, క్రిస్టలైన్ డిజైనర్ బ్లౌజ్ ధరించి, దానికి సరిపోయే మ్యాచింగ్ జ్యూయలరీలో జాన్వీ మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోలు చూసి జాన్వీ చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







