జాన్వీ మూడో సినిమా అతనితోనేనా?
శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంటరైన జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని ఎంతగా కష్టపడుతున్నా జాన్వీ కపూర్ టాప్ లీగ్ లోకి మాత్రం వెళ్లలేకపోయింది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన జాన్వీకి అక్కడ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేదు. తన ట్రాక్ రికార్డు చూడకుండా టాలీవుడ్ నుంచి మాత్రం అమ్మడికి మంచి ఛాన్సులే దక్కాయి. ఆర్ఆర్ఆర్ హీరోల సరసన ఇప్పటికే రెండు క్రేజీ సినిమాల్లో ఛాన్సు కొట్టేసింది జాన్వీ. త్వరలోనే మూడో సినిమాకు కూడా రంగం సిద్ధం చేస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా సినిమా కోసం జాన్వీని సంప్రదించినట్లు టాక్.
ఇంకా జాన్వీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం దేవర1 బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్న జాన్వీ, ఇతర బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఇంకా డేట్స్ ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబర్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాక కాల్షీట్స్ ను లాక్ చేయనున్నారు. నాని సినిమా కూడా కన్ఫర్మ్ అయితే జాన్వీ కపూర్ కు టాలీవుడ్ లో పాగా వేసేందుకు ఛాన్స్ దొరుకుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల కొరత అంశాన్ని జాన్వీ ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి మరి.













