దేవరను తెగ ప్రమోట్ చేస్తున్న జాన్వీ.. కారణమేంటంటే
శ్రీదేవి కూతురిగా సినీ రంగప్రవేశం చేసినా బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు దక్కించుకుంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరుస సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను చూపిస్తోంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలేవీ అమ్మడుకి ఊహించిన సక్సెస్ ను ఇవ్వలేదు. దీంతో జూ.ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది జాన్వీ.
దేవర సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే జాన్వీ మరో ఆఫర్ ను కూడా దక్కించుకుంది. ఇదిలా ఉంటే దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో జాన్వీ తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజైన జాన్వీ లుక్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైమున్నప్పటికీ జాన్వీ అప్పుడే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసింది. అడిగిన చోటా అడగని చోటా దేవర సినిమాలో తన పాత్ర గురించి తెగ మాట్లాడేస్తుంది జాన్వీ. దేవరలో తన పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్ ఉంటుందని, ఆ సినిమాలో ఛాన్స్ రావడం తన అదృష్టమని చెప్తోంది. దేవర సినిమాతో ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ కొట్టి, టాలీవుడ్ లో జెండా పాతడమే తన టార్గెట్ అని, అందుకే జాన్వీ ఈ ప్రమోషన్స్ ను ముందుగానే స్టార్ట్ చేసిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. మరి దేవర జాన్వీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













