ఎన్టీఆర్ కొత్త సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ….
అందానికి చిరునామా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కొంత కాలంగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తానంటూ ఊరిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎప్పటి కప్పుడు తన ఎంట్రీని దాట వేస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ అమ్మడిని సంప్రదించారు. ఏ స్టార్ ప్రొడ్యూసర్ తనని తెలుగులో పరిచయం చేయాలని సంప్రదించినా షాకిచ్చే రెమ్యునరేషన్ ని డియాండ్ చేస్తుందట.
తన రెమ్యూనరేషన్ తో నిర్మాతలని భయపెడుతూ వస్తోంది జాన్వీ. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ని తెలుగులో పరిచయం చేసి శ్రీదేవి క్రేజ్ ని వాడుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ ఆటలేవి సాగలేదు. ఇన్ని రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక క్లారిటీ ఇచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘RRR’తో ప్రపంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. ఇంతటి క్రేజీ మూవీ తరువాత తన తదుపరి మూవీ కూడా అదే స్థాయిలో పాన్ ఇండియా మూవీగా వుండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ సమర్ఫణలో ఈ భారీ మూవీని తెరకెక్కిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ‘ఆచార్య’ ఇచ్చిన షాక్ కారణంగా ప్రతీ విషయంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టిన చిత్ర బృందం తాజాగా ఫిల్మ్ నగర్ లో ఆఫీసుని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు జాన్వీ కపూర్.. తననే ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఫైనల్ చేయడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు జాన్వీ ఫాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట. వరుసగా బాలీవుడ్ లో ఫ్లాపుల్ని సొంతం చేసుకుంటున్న జాన్వీ కపూర్ ఫైనల్ గా తన బెట్టువీడి ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయడానికి రెడీ అయినట్టుగా చెబుతున్నారు.













