లాస్ ఏంజిల్స్ లో బాలీవుడ్ భామ చక్కర్లు..
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ రూహీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపిన జాన్వీకపూర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో సరదాగా చక్కర్లు కొడుతోంది. జాన్వీకపూర్ తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. జాన్వీకపూర్ ఓ అబ్బాయితో కలిసి సముద్ర ఒడ్డున ఉన్న రాళ్లపై కూర్చున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ జాన్వీకపూర్ పక్కనున్న వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. అతడి పేరు రోమన్ జారా. జాన్వీకపూర్ స్నేహితుడు, రోహన్‌ది కాలిఫోర్నియాలోని మాలిబు పాత్రం. జాన్వీ వెంట సోదరి ఖుషీ కపూర్ కూడా వెకేషన్‌కు వెళ్లింది. లిలాక్ స్ట్రాపీ టాప్, లావెండర్ ట్రౌజర్‌లో ఉన్న జాన్వీకపూర్ రాళ్లపై రోహన్ తో కూర్చొని కెమెరాకు పోజులిచ్చింది. ఇది ఒక నిమిషం లాస్ ఏంజెల్స్ లా ఉంది. కానీ మీరు దీన్ని ఇప్పటికీ ఇల్లులా భావిస్తారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
రూహిలో దెయ్యం పట్టిన మహిళ పాత్రలో జాన్వీ నటించింది. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన రూహిలో రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మ నటించారు. జాన్వీ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఘోస్ట్ స్టోరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం తనకి గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.













