Janhvi Kapoor: పూల చీరలో మెరిసిన జాన్వీ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) ఫ్యాషన్ ఎంపికలో ఎప్పుడూ ముందుంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జాన్వీకి సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా, తన ఫ్యాషన్ ఎంపికల ద్వారా వచ్చిన ఫాలోయింగే ఎక్కువ. ఎప్పటికప్పుడు స్టైలిష్ దుస్తులను అలంకరించి ఫ్యాన్స్ కు కన్నులవిందును కలిగించే జాన్వీ కపూర్ తాజాగా ఫ్లోరల్ శారీలో కనిపించింది. ఈ శారీలో జాన్వీ తన చేతిలో ఓ తెల్లని పువ్వుని పట్టుకుని చాలా సింపుల్ గా కనిపించి, మరింత అందంగా మెరిసింది. చేతికి వెండి గాజులు, జుమ్కాలు కూడా జాన్వీ లుక్ ను మరింత స్పెషల్ గా మార్చగా, నెటిజన్లు ఆ ఫోటోలకు లైకులు కొడుతూ బిజీగా మారారు.