Janhvi Kapoor: పింక్ మినీ డ్రెస్లో జాన్వీ హై ఎండ్ గ్లామర్ ట్రీట్
దేవర(Devara) సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ వెల్కమ్ అందుకున్న శ్రీదేవి(Sri Devi) నట వారసురాలు జాన్వీ కపూర్(Janhvi kapoor) ఆ తర్వాతి సినిమాను మరో స్టార్ హీరో అయిన రామ్ చరణ్(Ram Charan) తో చేయనున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ముంబైలో ర్యాంప్ షో, ఈవెంట్లలో సందడి చేస్తున్న జాన్వీ కపూర్ తాజాగా ఓ స్కూల్ వార్షికోత్సవంలో డిజైనర్ దుస్తుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పింక్ కలర్ మెరిసే మినీ డ్రెస్, మ్యాచింగ్ హీల్స్ లో కనిపించి తనదైన గ్లామర్ టచ్ ఇచ్చింది. ఈ ఈవెంట్ కు పలువురు భామలు హాజరవగా అందరికంటే హై ఎండ్ గ్లామర్ గా కనిపించింది మాత్రం జాన్వీనే అని బాలీవుడ్ మీడియా అంటుంది. జాన్వీ కొత్త ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













