Janhvi Kapoor: పూల చీరలో నెవర్ బిఫోర్ లుక్ లో శ్రీదేవి
అతి లోక సుందరి శ్రీదేవి(sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi kapoor), తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేకపోయినా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయంటే దానికి కారణం తన అందంతో జాన్వీ తెచ్చుకున్న గుర్తింపే. ఫ్యాషన్ ఎంపికల్లో రెగ్యులర్ గా అప్డేటెడ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ పూల చీరలో మెరిసి తన అందాలతో ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చింది. ఈ చీరలో జాన్వీ మరింత అందంగా ఉందని ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.







