Janhvi Kapoor: డిజైనర్ లెహంగాలో అదరగొడుతున్న జాన్వీ
శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ వేదికలపై కూడా కనిపిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గా జాన్వీ పింకర్ కలర్ లెహంగా లుక్ లో కనిపించి అందరినీ ఇంప్రెస్ చేసింది. ట్రెడిషనల్ డిజైన్ కు గ్లామర్ టచ్ ఇస్తూ జాన్వీ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. పింక్ షేడ్స్ లెహంగా, మేకప్ అన్నీ జాన్వీని మరింత అందంగా కనిపించేలా చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







